TG: లండన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు హైదరాబాద్ వాసులు చనిపోయారు. మృతులను నాదర్‌గూల్‌కు చెందిన చైతన్య(22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ(21)గా గుర్తించారు. మరో ఐదుగురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. గణేశ్ నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.