KKD: కన్న తండ్రిని కుమారుడు దారుణంగా హత్య చేసిన ఘటన కరప(M) ఉప్పలంక మొండిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. డబ్బుల విషయంలో తండ్రి కే.సూర్యచంద్రకు కుమారుడు చంద్రశేఖర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన చంద్రశేఖర్ తండ్రిని కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.