Megastar Chiranjeevi: క్యాన్సర్ బారిన పడ్డ చిరంజీవి..షాకింగ్ కామెంట్స్
క్యాన్సర్(Cancer)పై అవగాహన లేకపోయుంటే, తాను నిర్లక్ష్యంగా ఉండుంటే ఒకటి రెండేళ్ల తర్వాత తన పరిస్థితి ఎలా ఉండేదో తెలిసేది కాదని, అవగాహన ఉండడంతో ఆసుపత్రి(Hospital)కి వెళ్లి చికిత్స తీసుకున్న విషయాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తనకు క్యాన్సర్ ఉన్న సంగతి చెప్పేందుకు భయపడటం లేదని, తన ఫ్యాన్స్ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తానన్నారు.
తాను క్యాన్సర్(Cancer)కు గురైనట్లు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) షాకింగ్ కామెంట్స్ చేశారు. ముందుగా తాను క్యాన్సర్ బారిన పడినట్లు గుర్తించి చికిత్స తీసుకోవడం వల్లే బతికిబట్టకట్టానని చిరంజీవి అన్నారు. స్టార్ హాస్పిటల్(Star Hospital) నిర్వహించిన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను తెలిపారు. తాను ఆరోగ్యం(Health)గా ఉండేందుకు రోజు ఎక్సైర్సైజ్ చేస్తుంటానని, హెల్తీఫుడ్(Healthy Food), ఫైబర్ ఫుడ్ తీసుకుంటానని, తనకు న్యూట్రిషనిస్ట్ ఉండటం వల్ల ఏ జబ్బురాదులే అనుకుంటానని అన్నారు.
తనకు ఏ చెడు అలవాట్లు లేవని, ఎప్పుడో స్నేహితులతో కలిసి వైన్ మాత్రమే తాగుతానని చిరంజీవి(Megastar Chiranjeevi) అన్నారు. స్మోకింగ్(Smoking) అలవాట్లు లేవని, దాంతో ఎలాంటి క్యాన్సర్ రాదని అనుకున్నట్లు తెలిపారు. కానీ తాను ఏఐజీ ఆస్పత్రి(AIG Hospital)లో క్యాన్సర్‌కు తీసుకున్నట్లు చెప్పి షాక్ ఇచ్చారు. 45 సంవత్సరాలు దాటిన తర్వాత కొలన్ క్యాన్సర్(Cancer)తో తాను బాధపడినట్లు చిరంజీవి తెలిపారు. స్టేజ్-4లో ఉన్నప్పుడు తాను ఏఐజీ వెళ్లి డాక్టర్ నాగేశ్వర్రావును కలిశానని, పరీక్షల్లో పాలిప్స్ బయటపడ్డాయన్నారు. వెంటనే చికిత్స చేసి తొలగించినట్లు తెలిపారు.
క్యాన్సర్(Cancer)పై అవగాహన లేకపోయుంటే, తాను నిర్లక్ష్యంగా ఉండుంటే ఒకటి రెండేళ్ల తర్వాత తన పరిస్థితి ఎలా ఉండేదో తెలిసేది కాదని, అవగాహన ఉండడంతో ఆసుపత్రి(Hospital)కి వెళ్లి చికిత్స తీసుకున్న విషయాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తనకు క్యాన్సర్ ఉన్న సంగతి చెప్పేందుకు భయపడటం లేదని, తన ఫ్యాన్స్ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తానన్నారు. హైదరాబాద్, జిల్లాల్లోనూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తానని, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల కోసం స్టార్ హాస్పిటల్(Star Hospital)తో మాట్లాడినట్లు తెలిపారు. హైదరాబాద్ క్యాన్సర్ నియంత్రణకు హబ్‌గా కావాలని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఆశా భావం వ్యక్తం చేశారు.