»Chance Of Rain In Telugu States Next Three Days June 25th 2023
Weather forecast: వచ్చే 3 రోజులు వానలే..అప్రమత్తంగా ఉండాలి!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు కూడా వానలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో(telugu states) నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీని ప్రభవంతో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో వాన దంచి కొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం ధాటికి పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న మూడు రోజుల పాటు.. రెండు తెలుగు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు.
ఇక 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వానలు దంచి కొడుతున్నాయి. రెండు, మూడు రోజులు భారీ వర్షాలు(heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతంలో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. అంతేకాకుండా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారు. అటు రాయలసీమ జిల్లాలోను 3రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముందని వెల్లడించింది.
తెలంగాణలో రానున్న 3రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్(hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గర్లో… సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం కొనసాగుతున్నదని వెల్లడించింది. ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతి దిశగా కొనసాగుతుందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఏడు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రాష్ట్రంలో రాగల ఏడురోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది.
హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులుగా మారిపోయాయి. మరో 24 గంటలు హైదరాబాద్ ప్రజలు(people) అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు (ఆదివారం), రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.