KKD: ప్రేమ విఫలమవడంతో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో చోటుచేసుకుంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆదివారం యూనివర్సిటీ బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మృతుడు మన్యం జిల్లా సాలూరు మండలం దేవ బుచమ్మపేటకి చెందిన గుంట్రెడ్డి మనోజ్‌గా గుర్తించారు.