»Brs Mlc Kavitha To Appear Before Ed On March 11 In Delhi Excise Policy Case
Delhi excise policy case: అందుకే అత్యవసర నోటీసులు, ముందస్తు బెయిల్ కోసం…!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దర్యాఫ్తు సంస్థ ఈడీ అత్యవసర నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
Delhi excise policy case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో (delhi liquor scam case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (BRS leader), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (mlc kalvakuntla kavitha) దర్యాఫ్తు సంస్థ ఈడీ (ED) అత్యవసర నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ (Delhi) బయలుదేరి వెళ్లారు. మనీ లాండరింగ్ (money laundering) ఆరోపణల నేపథ్యంలో దర్యాఫ్తు నిమిత్తం ఈ నెల 9వ తేదీన ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ముందస్తు కార్యక్రమాల వల్ల రాలేనని, 11వ తేదీన విచారణకు హాజరవుతానని కవిత చెప్పినప్పటికీ, ఈడీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో కవిత ఒకరోజు ముందే ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. అదే సమయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో పెట్టాలని కవిత శుక్రవారం ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించారు. అయితే ఈడీ సమాచారాన్ని బట్టి ఆమె ముందుకు వెళ్లే అవకాశముంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొని, అరెస్టైన అరుణ్ రామచంద్ర పిళ్లై (arun ramachandran pillai), ఆడిటర్ బుచ్చిబాబు (buchi babu) ఇద్దరూ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) సన్నిహితులు. కవిత బినామీగా పిళ్లైని రిమాండ్ రిపోర్టులో (remand report) పేర్కొన్నది ఈడీ. వీరు ఈడీ (ED) అదుపులో ఉన్నారు. ఈ నేపథ్యంలో పిళ్లై, బుచ్చిబాబుతో కలిసి కవితను కూడా ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులు పంపారు.
ఇలాంటి సమయంలో కవిత విచారణకు హాజరవడం వల్ల దర్యాప్తు సంస్థలకు మరింత సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. వారితో కలిసి విచారించడం లేదా వారు ఈడీ అదుపులో ఉండటంతో… వారి నుండి రాబట్టిన సమాచారం ఆధారంగా వెంటనే కవితకు విచారించడంతో మరిన్ని అంశాలు వెలుగు చూసే అవకాశాలు ఉంటాయి. ఈ నెల పదమూడో తేదీన కవిత పుట్టిన రోజు నేపథ్యంలో, ఆ తర్వాత విచారణకు హాజరు కావాలని ఆమె భావించారట. అదే సమయంలో పిళ్లై వారం రోజుల కస్టడీ కూడా అప్పటి వరకు ముగియనుంది. కానీ అంతలోనే ఈడీ నోటీసులు జారీ చేసి, 9వ తేదీనే రావాలని హుకూం జారీ చేసింది. తాను ఈ నెల 11వ తేదీన విచారణకు వస్తానని బుధవారం రాత్రి కవిత ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. కానీ సమాధానం రాలేదు. మరోవైపు, కవితకు న్యాయ సహాయం కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ రంగంలోకి దిగింది.
ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. వారిని దర్యాఫ్తు సంస్థలు తొలుత విచారణకు పిలిచాయి. విచారణ అనంతరం సహకరించడం లేదు.. అనుమానాలు ఉన్నాయనే కారణంతో వారిని అరెస్టు చేశాయి. కోర్టు అనుమతితో తమ కస్టడీకి కూడా కోరి, విచారణ చేశారు. ఈ నేపథ్యంలో కవిత విషయంలో అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం (anticipatory bail) కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అదే సమయంలో కవితకు నోటీసుల నేపథ్యంలో అరెస్టు జరిగితే.. రాష్ట్రంలో ఎలాంటి శాంతి భద్రత సమస్య తలెత్తకుండా పోలీసు శాఖ అప్రమత్తమైంది.