CTR: CM సహాయనిధి చెక్కును టీడీపీ పుంగనూరు శ్రేణులు శనివారం పంపిణీ చేశారు. మండల పరిధిలోని మర్సనపల్లికు చెందిన మంగమ్మ కుటుంబ సభ్యులకు రూ.60,000ల విలువైన చెక్కును మండల సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పురి రమేష్ పార్టీ శ్రేణులతో కలిసి అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.