»Brs First List Is Ready Kcr Is Contesting In Two Positions
BRS Candidates 1st List: బీఆర్ఎస్ మొదటి లిస్ట్ రెడీ..రెండు స్థానాల్లో కేసీఆర్ పోటీ
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే తమ అభ్యర్థుల మొదటి జాబితాలను విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఆ జాబితాను ప్రకటించారు.
తెలంగాణ (Telangana)లో పొలిటికల్ హీట్ ఎక్కువైంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వంటివి అన్ని నియోజకవర్గాల్లో తమ తమ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ తమ మొదటి జాబితాలను (BRS Candidates 1st List) రెడీ చేసింది.
బీఆర్ఎస్ (BRS) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ (CM KCR) నేడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థులు మొదటి జాబితాను రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాల్లో పెద్దగా మార్పులేమీ చేయలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే వేములవాడలో రమేశ్‌కి టికెట్ ఇవ్వడం లేదని ప్రకటన చేశారు.
నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితా ఇదే:
గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల నుండి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ – తాటికొండ రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి చోటిచ్చారు. ఉప్పల్ – భేతి సుభాష్‌రెడ్డి స్థానంలో బండారు లక్ష్మారెడ్డికి చోటిచ్చారు. వైరా – రాములునాయక్ స్థానంలో మదన్‌లాల్‌ని ఎంపిక చేశారు. వేములవాడ – చెన్నమనేని రమేష్ స్థానంలో, చల్మెడ లక్ష్మీనర్సింహారావుకి చోటు కల్పించారు. ఖానాపూర్ – రేఖానాయక్ స్థానంలో జాన్సన్ నాయక్ కి చోటిచ్చారు. బోథ్ – రాథోడ్ బాపూరావు స్థానంలో అనిల్ జాదవ్‌కి స్థానం కల్పించారు. ఆసిఫాబాద్ – ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మికి చోటు లభించింది. కామారెడ్డి – గంప గోవర్ధన్ స్థానంలో కేసీఆర్ పోటీ చేయనున్నారు.