Mynampally Hanumanth Rao Made Hot Comments On Minister Harish Rao
Mynampally Hanumanth Rao: తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanth Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మెదక్లో మంత్రి హరీశ్ రావు పెత్తనం ఏంటో అర్థం కావడం లేదన్నారు. మెదక్ గురించి పట్టించుకోవడం మానుకోవాలని సూచించారు. లేదంటే ఆయన అంతుచూసే వరకు వదలబోనని హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటన వేళ.. మైనంపల్లి కామెంట్స్ తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో తీవ్ర దుమారం రేపింది.
కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మల్కాజిగిరి నుంచి తాను, మెదక్ అసెంబ్లీ నుంచి తన కుమారుడు బరిలోకి దిగుతాడని తేల్చిచెప్పారు. కుమారుడికి టికెట్ ఇవ్వకుంటే తాను కూడా పోటీ చేయనని తెలిపారు. ఇద్దరం ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం అంటున్నారు. కొడుకుని ఎమ్మెల్యే చేయడమే తన లక్ష్యం అని మైనంపల్లి చెబుతున్నారు. మల్కాజిగిరితోపాటు మెదక్ సీటు కోసం మైనంపల్లి పట్టుబడుతున్నారు.
అక్కడ మరో అభ్యర్థికి టికెట్ అనే ప్రచారం రావడంతో మంత్రి హరీశ్ రావును లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanth Rao). సీఎం కేసీఆర్ అల్లుడిని టార్గెట్ చేసి విమర్శించడం చర్చకు దారితీసింది. అభ్యర్థుల ప్రకటనకు ముందు వచ్చిన కామెంట్లు ప్రాధాన్యం సంతరించుకుంది.