RR: రాయదుర్గం ఫ్లైఓవర్ కింద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ ఎలక్ట్రికల్ ట్రాలీ ఆటో యూటర్న్ తీసుకుంటున్న కారుపై బోల్తా పడింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ఉన్నవారికి ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆటోను స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.