»Bandi Sanjay Attend To The Mahila Commission Enquiry
Mahila commission విచారణకు బండి సంజయ్, లీగల్ టీమ్ సహా లిస్ట్
Bandi sanjay:మహిళా కమిషన్ విచారణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చారు. ఇటీవల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సెషన్ నేపథ్యంలో 18వ తేదీన హాజరవుతానని చెప్పి.. ఈ రోజు విచారణకు హాజరయ్యారు.
Bandi sanjay attend to the mahila commission enquiry
Bandi sanjay:మహిళా కమిషన్ విచారణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) వచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై (kavitha) అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సెషన్ నేపథ్యంలో 18వ తేదీన హాజరవుతానని చెప్పి.. ఈ రోజు విచారణకు హాజరయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత (kavitha) గురించి ఇటీవల బండి సంజయ్ (Bandi sanjay) మాట్లాడారు. కవితను (kavitha) ఈడీ (ed) అరెస్ట్ చేయకుంటే ముద్దు పెట్టుకుంటుందా అని అన్నారు. దీంతో పెద్ద దుమారమే చెలరేగింది. బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో ఆ పార్టీ నేతలు సంజయ్‌పై (sanjay) కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీచేసింది.
ఈ రోజు కమిషన్ విచారణకు సంజయ్ (Bandi sanjay) తన లీగల్ టీమ్‌తో కలిసి వచ్చారు. ఆయన చేతిలో పెద్ద జాబితా ఉంది. అందులో బీఆర్ఎస్ నేతలు (brs leaders) మహిళలపై చేసిన కామెంట్లకు సంబంధించి స్టేట్ మెంట్స్ ఉన్నాయని తెలిసింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (dayakar rao).. మహిళ ఎంపీడీవోను ‘ఊపుతున్నావు’ అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే శంకర్ నాయక్ (shankar naik) అయితే షర్మిలనే కొజ్జా అని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ (sanjay) వేధింపుల వల్లే చైర్ పర్సన్ పదవీకి శ్రావణి రాజీనామా చేశారు. చిడమర్తి లింగయ్య, తదితర నేతలు మహిళలపై చేసిన కామెంట్ల గురించి ఆయన కమిషన్‌కు ఇచ్చే అవకాశం ఉంది.
వీటితోపాటు మంథనిలో లాయర్ దంపతులపై దాడి.. ఇటీవల ప్రీతి కేసు.. గవర్నర్‌పై కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్ల గురించి సంజయ్ చెప్పే ఛాన్స్ ఉంది. కౌశిక్ రెడ్డిని సారీ చెబుతూ లేఖ రాయాలని స్పష్టంచేయడంతో అందుకు ఆయన అంగీకరించారు. తమపై ఎందుకు కక్షసాధింపు అని.. సంజయ్ కమిషన్ ముందు చెప్పే ఛాన్స్ ఉంది. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని.. సారీ చెప్పనని ఇప్పటికే బండి సంజయ్ స్పష్టంచేశారు. అదే మాటకు కట్టుబడి ఉన్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.