KNR: గన్నేరువరం మండలం హనుమాజ్ పల్లి గ్రామానికి చెందిన పారునంది వీరయ్య(44) సౌదీ అరేబియాలో గుండెపోటుతో మృతి చెందారు. జీవనోపాధి కోసం సౌదీలోని సకాకలో కార్ డ్రైవర్గా పనిచేస్తున్న వీరయ్య అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వీరయ్య మృతితో కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.