తాడేపల్లి గోశాలలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో... సూపర్ సింగర్స్, సరిగమప లిటిల్ ఛాంప్స్ ద్వారా పరిచయమైన మయూక్, సాయి వేద వాగ్ధేవిల పాటకు సీఎం జగన్ మంత్రముగ్ధులయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఆధ్వర్యంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం (Thadepalli Chief Minister Camp office) సమీపంలోని గోశాలలో (Thadepalli Gowshala) ఉగాది సంబరాలు జరిగాయి. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి (AP Chief Minister YS Jagan Mohan Reddy) తన సతీమణి వైయస్ భారతితో (YS Bharathi Reddy) కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం (Ugadi Panchanga Sravanam) తర్వాత పచ్చడిని స్వీకరించి, ఆ తర్వాత సాంస్కృతిక కళా ప్రదర్శలను తిలకించారు. తొలుత పలువురు బాలికలు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన వివిధ పథకాలతో.. (YS Jagan government Schemes) అదే అదే ఉగాది పేరుతో ఓ ప్రదర్శన ఇచ్చారు. పరిపాలన వికేంద్రీకరణ, జిల్లాల పెంపు, రెవెన్యూ డివిజన్ల పెంపు, మున్సిపాలిటీల పెంపు, వివిధ పరిశ్రమలతో ఒప్పందాలు అంటూ నాట్య ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత పద్మజారెడ్డి… హరిగిరి నందిని నాట్య ప్రదర్శనను చేశారు.
అనంతరం సూపర్ సింగర్స్, సరిగమప లిటిల్ ఛాంప్స్ ద్వారా పరిచయమైన మయూక్, సాయి వేద వాగ్ధేవిల పాటకు సీఎం జగన్ మంత్రముగ్ధులయ్యారు. చేతి వేళ్లతో తాలం వేశారు. మయూక్ నిగమ నిగమాంత వర్ణి మనోహర రూప నటరాజ పాటను పాడి అక్కడున్న అందరినీ దైవభక్తిలో ముంచెత్తారు. ఈ చిన్నారి మయూక్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో మనసులు కరగని లోకమే లోకమా పేరుతో మంచి పేరు సంపాదించుకున్నారు. అటు తర్వాత తొమ్మిదేళ్ల సాయి వేద వాగ్ధేవి కన్నులతో చూసేది గురువా పాట పాడారు. ఈ చిన్నారుల పాటలకు జగన్ తన్మయత్వంలోకి వెళ్లారు. చివరలో ఆనందసాయి బృందం.. వీధుల వీధుల విభుడే భక్తి గీతాన్ని తిలకించారు జగన్ దంపతులు.
ఈ కార్యక్రమంలో మంత్రి రోజా, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి పాల్గొన్నారు. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టి పడే విధంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. వేడుకలకు ముందు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జగన్ దంపతులు పూజలు చేసి, ఉగాది పచ్చడిని స్వీకరించారు. జగన్ దంపతులకు మంత్రి రోజా మెమొంటో అందించారు. సాంస్కృతిక శాఖ రూపొందించిన క్యాలెండర్ ను జగన్ ఆవిష్కరించారు.