»Alluri Seetarama Raju Death Anniversary Janasena Chief Demands Bharat Ratna
Alluri Seetarama Rajuకు భారతరత్న ఇవ్వాలి.. పవన్ కల్యాణ్ డిమాండ్
రులకు పుట్టుకే గాని గిట్టుక ఉండదు. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుంది. వారు రగిల్చిన విప్లవాగ్ని, సర్వదా జ్వలిస్తూనే ఉంటుంది. అటువంటి మన్యంవీరుడు అల్లూరి సీతారామారాజు. దేశ ప్రజలకు సీతారామారాజు సంకల్పం...
మన్యంవీరుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామారాజు (Alluri Seetarama Raju) 99వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ (Telangana), ఏపీ ప్రజలు నివాళులర్పించారు. తెలంగాణలో హైదరాబాద్ (Hyderabad)లోని ట్యాంక్ బండ్ (Tankbund)పై ఉన్న అల్లూరి విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక ఏపీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు , జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) తదితరులు అల్లూరికి అంజలి ఘటించారు.
‘గిరిజనులతో కలిసి పరాయి పాలనపై తిరుగులేని పోరాటం చేసి, పాతికేళ్లకే దివికేగిన స్వర్గీయ అల్లూరి సీతారామరాజు సాహసాన్ని, త్యాగాన్ని, దేశభక్తిని స్మరించుకుంటూ.. అల్లూరి వర్ధంతి సందర్భంగా ఆ తెలుగు వీరుని స్మృతికి నివాళులర్పిస్తున్నా’ అని చంద్రబాబు (Nara Chandrababu Naidu) ట్వీట్ చేశారు. ఇక పవన్ అల్లూరికి భారతరత్న (Bharat Ratna) ప్రకటించాలని డిమాండ్ చేశారు. వర్ధంతి సందర్భంగా సీతారామారాజును పవన్ (Pawan Kalyan) స్మరించుకున్నారు. ‘వీరులకు పుట్టుకే గాని గిట్టుక ఉండదు. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుంది. వారు రగిల్చిన విప్లవాగ్ని, సర్వదా జ్వలిస్తూనే ఉంటుంది. అటువంటి మన్యంవీరుడు అల్లూరి సీతారామారాజు. దేశ ప్రజలకు సీతారామారాజు సంకల్పం, పోరాట పటిమ, ధీరత్వం, మృత్యువుకు వెరవని ధైర్యం గురించి తెలియాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. మహానీయుడికి భారతరత్న ప్రకటించాలి’ పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు.