అక్కినేని మూడో తరం హీరో అఖిల్ కటౌట్‌కి సాలిడ్ మాస్ సినిమా పడితే.. చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు. కానీ వాళ్ల కోరిక మాత్రం తీరడం లేదు. ఫస్ట్ ఫిల్మ్ అఖిల్‌తో మాస్ ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయాడు అఖిల్. ఆ తర్వాత క్లాస్ సినిమాలకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఏజెంట్ మూవీతో మాసివ్ హిట్ అందుకోవడానికి.. గట్టిగా ట్రై చేస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా ఏజెంట్‌తో బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే చాలా రోజులుగా ఈ సినిమా డిలే అవుతూ వస్తోంది. వచ్చే సమ్మర్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నాడనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. అఖిల్ అదిరిపోయే ఛాన్స్ కొట్టేశాడని ఫిలిం నగర్ గుసగుసలు. కేజీఎఫ్, కాంతార లాంటి సూపర్ డూపర్ హిట్స్ అందించిన హోంబలే ఫిల్మ్స్.. అఖిల్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తుదట. ఇటీవలె హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్.. రాబోయే 5 ఏళ్లలో సినిమా రంగంలో 3000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అందుకు తగ్గట్టే.. సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటోంది హోంబలే సంస్థ. ప్రస్తుతం ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్లో ‘సలార్’ మూవీని నిర్మిస్తున్నారు. ఆ తర్వాత అఖిల్‌తో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమైతే.. అఖిల్ ఖాతాలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పడిపోయినట్టే.