MNCL: మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం రాత్రి రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని వయసు 30 నుంచి 35 సంవత్సరాలు ఉండగా.. కుడి చేతికి రబ్బర్ కడియం, నలుపు రంగు టీ షర్ట్ ధరించాడు. జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.