సత్యసాయి: ఆమడగూరు మండలం మారుతీపురం సమీపంలో కర్ణాటకకు చెందిన ముత్తప్ప అనే వ్యక్తి గురువారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికంగా 5 ఎకరాల పొలం తీసుకొని వ్యవసాయం చేస్తున్నట్లు సమాచారం. మృతుడి మెడ, గొంతుపై గాయాలు ఉండటంతో హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.