TG: నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహాలతో తండ్రి వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. మృతులు మోక్షిత, వర్షిణి, శివధర్మ.. చిన్నారుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. పురుగుల మందు తాగి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు ప్రకాశం జిల్లా బోయలపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు.