KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి భాకరాపేట సమీపంలో ఇవాళ కడప నగరానికి చెందిన వ్యక్తులు కారులో రేణిగుంటకు వెళ్తుండగా.. ఆవు అడ్డం రావడంతో కారు అదుపు తప్పి ముళ్లపదల్లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న మహిళకు స్వల్ప గాయాలవ్వగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం తెలుసుకున్న సిద్ధవటం ఎస్సై మహమ్మద్ రఫీ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.