VSP: స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడు శనివారం మృతి చెందాడు. పెద గంట్యాడ నడుపూర్కు చెందిన సిహెచ్ అప్పలనాయుడు సీడీసీపీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు 30 అడుగుల ఎత్తు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు ఆసుపత్రికి తరలించారు. స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.