KKD: పెద్దాపురంలోని స్థానిక బ్యాంకు కాలనీలో కిరాణా దుకాణానికి సిగరెట్లు కావాలంటూ వచ్చిన ఇద్దరు.. దుకాణంలో ఉన్న ఊర్ల లక్ష్మి మెడలోని సుమారు రూ.4 లక్షల విలువైన బంగారు గొలుసు అపహరించి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీ.మౌనిక తెలిపారు.