ప్రకాశం: కొనకనమిట్ల మండలం చౌటపల్లిపాలెం గ్రామ సమీపంలో రహదారి వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్ళిపోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.