SRD: నారాయణఖేడ్‌లో 16 ఏళ్ల మైనర్ బాలికపై ప్రేమ పేరుతో అత్యాచారం జరిగిన ఘటన శుక్రవారం కలకలం సృష్టించింది. అత్యాచారం చేసిన యువకుడు బాలికను రోడ్డుపై వదిలేసి పారిపోయాడు. బాధితురాలిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.