అఫ్గానిస్థాన్లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 800 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మరో 2,500మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం. భూకంపం ధాటికి పలు గ్రామాల్లో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయబృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.