TG: బిజినెస్ పేర మోసాలకు పాల్పుడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖకు చెందిన కాంతిదత్ జూబ్లీహిల్స్లో సస్టెయిన్ కార్ట్ పేరుతో స్టోర్ ప్రారంభించి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలేదు. తరువాత తృతీయ పేరుతో జ్యూలరీ షాప్ ప్రారంభించి పరిణితి చోప్రాతో ప్రాచారం చేశాడు. పరిణితికి ఇవ్వాలంటూ శ్రీజా రెడ్డి అనే మహిళను నమ్మించి రూ.1.5కోట్లు తీసుకున్నాడు. అలాగే నకిలీ పత్రాలతో ఎస్బీఐలో దాదాపు రూ.3.37 కోట్లు తీసుకున్నాడు.