కృష్ణా: గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. మిర్చి కోతకు ఆటోలో కూలీలు పనికి వెళ్తుండగా తిరువూరు నుంచి ఉమ్మడిదేవరపల్లి వెళుతున్న బస్సు ఢీ కొట్టింది. కూలీలలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన మిగిలిన కూలీలు 108కి సమాచారం ఇచ్చారు. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మంచు ప్రభావంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.