నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడి 29 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో 100 మంది ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. పడవలో అధిక సంఖ్యలో ప్రయాణికులతో పాటు సరుకులు కూడా ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.