VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు చేపట్టారు. దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్ సోర్శింగ్ ఉద్యోగి సురేష్ రూ. 500 కట్టను ఎవరికీ కనిపించకుండా దాచే ప్రయత్నం చేశారు. సీసీటీవీలో గమనించిన ఈవో త్రినాథరావు అధికారులను తనిఖీ చేయమని ఆదేశించారు. తనిఖీలలో 111 ఐదు వందల రూపాయల నోట్లను గుర్తించారు. దీంతో వారిని ఈవో విధుల నుంచి సస్పెండ్ చేశారు.