కోనసీమ: రామచంద్రపురం మండలం చినతాళ్లపొలం శివారులో మంగళవారం సాయంత్రం పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని ద్రాక్షారామ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై ఎం. లక్ష్మణ్ తన సిబ్బందితో దాడి చేసి రూ. 14,830 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిని బుధవారం కోర్టులో హాజరు పరచనున్నట్టు ఎస్సై తెలిపారు. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.