KDP: కోడి కోసం వెళ్లిన వ్యక్తి చనిపోయిన ఘటన జిల్లాలో జరిగింది. కొండాపురంలోని వడ్డెవాళ్ల కాలనీకి చెందిన కుడుమల నాగేశ్(52) ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో కోళ్ల కోసం మిద్దె పైకి ఎక్కారు. ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.