పాకిస్థాన్లో నిన్న రాత్రి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, సుమారు 18 మంది గాయపడ్డారు. బలోచిస్థాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు అతావుల్లా మెంగల్ వర్ధంతి సందర్భంగా రాజకీయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం జరుగుతుండగా ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఘటనాస్థలంలోనే పలువురు ప్రాణాలొదిలారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.