NLR: అనంతసాగరం మండలం శంకరనగరం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు-బైకు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు అయింది.