VSP: చోడవరం సబ్ జైలు నుంచి తప్పించుకున్న రిమాండ్ ఖైదీలను విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం చాకచక్యంగా పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం చోడవరం సబ్ జైలు సిబ్బందిపై దాడి చేసి పారిపోయిన నిందితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖ రైల్వే, బస్ స్టేషన్లు, బస ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. శనివారం వారిని అరెస్ట్ చేశారు.