ELR: కొయ్యలగూడెం మండలం రాజవరంలో మంగళవారం దుగ్గిరాల రామారావు ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా మంటలు వ్యాపించి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని జెడ్పీటీసీ దాసరి శ్రీలక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు.