AP: కర్నూలులో బంగారు దుకాణం యజమాని దారుణ హత్యకు గురయ్యారు. నగరంలోని రాధాకృష్ణ టాకీస్ వద్ద హిజార్ అనే యజమానిపై దుండగులు దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందతూ హిజార్ మృతిచెందారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, కర్నూలులో ఒకేరోజు 2 హత్యలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.