NZB: రుద్రూర్ మండలం అంబం క్రాస్ రోడ్లో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొన్న ఘటనలో వర్నికి చెందిన హఫీజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రుద్రూర్ నుంచి వర్ని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు 108 అంబులెన్స్‌లో బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.