5 papers leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజ్ (paper leak) అంశానికి సంబంధించి సిట్ కీలక విషయం తెలిపింది. మొత్తం 5 పేపర్లు లీక్ అయ్యాయని పేర్కొంది. కమిషన్ సర్వర్ (server) నుంచి ప్రవీణ్ 5 పేపర్లను తీశాడని సిట్ చీఫ్ శ్రీనివాస్ (sit chief srinivas) తెలిపారు. ఏఈ, టౌన్ ప్లానింగ్, వెటర్నరీలతోపాటు ఎంవీఐ, గ్రౌండ్ వాటర్ శాఖ పోస్టుల పేపర్లు అతని వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.
5 papers leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజ్ (paper leak) అంశానికి సంబంధించి సిట్ కీలక విషయం తెలిపింది. మొత్తం 5 పేపర్లు లీక్ అయ్యాయని పేర్కొంది. కమిషన్ సర్వర్ (server) నుంచి ప్రవీణ్ 5 పేపర్లను తీశాడని సిట్ చీఫ్ శ్రీనివాస్ (sit chief srinivas) తెలిపారు. ఏఈ, టౌన్ ప్లానింగ్, వెటర్నరీలతోపాటు ఎంవీఐ, గ్రౌండ్ వాటర్ శాఖ పోస్టుల పేపర్లు అతని వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఎంవీఐ, గ్రౌండ్ వాటర్ శాఖల పోస్టుల భర్తీ పరీక్షలు జరగాల్సి ఉంది. సో.. అభ్యర్థులు టెన్షన్ పడాల్సిన అసవరం లేదు లేదు. ఈ ప్రశ్నాపత్రాలను సమయం చూసి ఇస్తానని రేణుకకు ప్రవీణ్ చెప్పాడని సిట్ చీఫ్ శ్రీనివాస్ తెలిపారు.
మరోవైపు పేపర్ లీక్ కేసులో ఏ2 రాజశేఖర్ (rajashekar) గురించి ఆసక్తికర అంశాన్ని టీఎస్టీఎస్ చైర్మన్ జగన్మోహన్ రావు (jaganmohan rao) తెలిపారు. తన చైర్మన్ పదవీ చేపట్టకముందే టీఎస్ టీఎస్‌లో చేరాడని పేర్కొన్నారు. గతంలో బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశాడని వివరించారు. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నాడని పేర్కొన్నారు. దానిని కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ టీఎస్టీఎస్పై ఆరోపణలు చేస్తుందన్నారు. మంత్రి కేటీఆర్ (ktr) కూడా రాజశేఖర్ గురించి ప్రస్తావించారు. అతను బీజేపీ కార్యకర్య అని ఆరోపణలు చేశారు. ఈ అంశంపై విచారణ జరపాలని డీజీపీని కోరారు.
ప్రవీణ్‌ను (Praveen) ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా నియమించారని.. ప్రభుత్వ పెద్దల కోసమే పేపర్ లీక్ చేశారని బీజేపీ సోషల్ మీడియా తిప్పికొడుతుంది. కమిషన్ కంప్యూటర్ల బాధ్యత ఐటీ శాఖదేనని బండి సంజయ్ (bandi sanjay) అన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్‌ను (ktr) అరెస్ట్ చేసే దమ్ముందా అని బండి సంజయ్ (bandi sanjay) ప్రశ్నించారు. క్యాబినెట్ నుంచి ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రవీణ్ 2017లో జూనియర్ అసిస్టెంట్‌గా (junior assistant) చేరాడు. టీఎస్ పీఎస్సీ వెరిఫికేషన్ విభాగంలో పనిచేసిన సమయంలో.. అప్లికేషన్లలో వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చిన మహిళలతో (woman) మాట కలిపేవాడట. సమస్య పరిష్కరించి.. నంబర్ తీసుకునేవాడట. వారిలో కొందరితో సంబంధం కూడా పెట్టుకున్నట్టు తెలిసింది. ప్రవీణ్ (praveen) రాసలీలల గురించి సిట్ అధికారులు కూపీ లాగుతున్నారు. టీఎస్ పీఎస్సీకి (ts psc) వచ్చే మహిళలను అతను ట్రాప్ చేశాడని అధికారులు గుర్తించారు. 40 మంది (40) మహిళలతో అతను చాట్ చేశాడని పేర్కొన్నారు. మహిళలతో పరిచయం పెంచుకొని.. వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడాలని ప్రవీణ్ ఒత్తిడి చేశాడట. అతని ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.