KRNL: పాణ్యంలోని జాతీయ రహదారిపై సాయిబాబా నర్సరీ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో దిగి వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. బైక్పై ప్రయాణిస్తున్న వారికీ స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని శాంతిరాం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.