కృష్ణా: బంటుమిల్లి మండలం పెదతుమ్మిడిలో నిర్మాణంలో ఉన్న ఇంటి సెప్టిక్ ట్యాంక్‌లో ఝార్ఖండ్‌కు చెందిన కార్మికుడు వికాస్ కుమార్ శర్మ (45) బుధవారం దుర్మరణం చెందాడు. భోజనం తర్వాత టాయిలెట్‌కు వెళ్తుండగా ట్యాంక్‌లో పడిపోయిన అతన్ని సహచరులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.