VSP: పెందుర్తి పెద్ద చెరువు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటో, బైక్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సరిపల్లికి చెందిన కండిపల్లి కన్నయ్య తన భార్య దేవి, కుమార్తె భారతి, కోడలు నాగమణితో కలిసి ఆటోలో అక్కిరెడ్డిపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.