HYD: అమీన్పూర్లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే గృహిణి పార్వతి (31) ఉరేసుకుని చనిపోయింది. మృతురాలికి విష్ణువర్ధన్ (7), సాత్విక్ (6) ఇద్దరు కుమారులు. భర్త వెంకట కోటేశ్వరరావు సాఫ్ట్వేర్ ఉద్యోగి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.