ELR: ఏలూరు కర్రవంతెన కృష్ణా కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడా? లేక ఎక్కడి నుంచి అయినా కొట్టుకు వచ్చిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.