ప్రకాశం: జిల్లా కంభం మండలం దర్గా గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైన సంఘటన ఇవాళ వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నాయని, పెట్రోల్ పోసి నిప్పంటించడంతో శరీరం కొంత భాగం కాలిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు.