కోనసీమ: అమలాపురంలో దారుణం చోటు చేసుకుంది. భర్తను కట్టుకున్న భార్య కడతేర్చింది. తన పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నాడని హత్యకు పాల్పడినట్లు భార్య పోలీసులకు తెలిపినట్లు సమాచారం. స్థానికుల వివరాల ప్రకారం అమలాపురం రూరల్ నడిపూడి శివారు మెట్ల రాంజీ కాలనీలోని భర్త దొమ్మేటి రాంబాబుపై భార్య అతి కిరాతకంగా దాడి చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.