అఫ్గానిస్థాన్‌ను భూకంపం అతలాకుతలం చేసింది. భారీ భూకంపంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మృతుల సంఖ్య 1400కి చేరినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లాహ్ ముజాహిద్ వెల్లడించారు. మరో 3000 మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం. భూకంపం ధాటికి పలు గ్రామాల్లో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయబృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.