ఏలూరు నగరంలోని ఓ మురుగు కాలువలో బుధవారం మృతదేహం కలకలం రేపింది. ఒకటవ పట్టణ పరిధిలోని పాండురంగ థియేటర్ సమీపంలో డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు. మృతదేహం నీటిపై తేలి ఆడుతూ ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒకటవ పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.