»233 Killed And 900 Injured In Odisha Train Accident
Odisha train accident:లో 280 మంది మృతి, 900 మందికి గాయాలు
ఒడిశాలో మూడు ట్రైన్లు ఢీకొన్ని ఘటనలో సుమారు 233 మంది మరణించారు. మరో 900 మందికి పైగా గాయపడ్డారు. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది.
బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొని ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 280 మంది మరణించగా, దాదాపు 900 మందికిపైగా గాయపడ్డారని అధికారులు శనివారం తెలిపారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ షాలీమార్ నుంచి చెన్నై వెళ్తున్న క్రమంలో బహగాన స్టేషన్ వద్ద 7.15కు ప్రమాదం జరిగింది. అదే సమయంలో పట్టాలు తప్పి లూప్ లైన్లో ఆగిఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో ఇంజిన్ తోపాటు 12 బోగీలు పక్క ట్రాక్ పై పడ్డాయి. ఆ క్రమంలో ట్రాక్ పై యశ్వంత్ పూర్ హౌరా ఎక్స్ ప్రెస్ దూసుకొచ్చి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. దీంతో యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్ కు చెందిన నాలుగు జనరల్ బోగీలు ధ్వంసమయ్యాయి. మరోవైపు కోరమాండల్ ఎక్స్ ప్రెస్‌లో ఏ1, ఏ2, బీ2, బీ4, బీ5, బీ6, బీ7, బీ8, బీ9 కోచులు కూడా ధ్వంసమయ్యాయి. బీ1 బోగీ ఇంజిన్ తో పాటు పట్టాలు తప్పింది. కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు మొత్తం 24 బోగీలు ఉంటే దాదాపు సగం ధ్వంసమైనట్లు తెలుస్తోంది. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న రైలు కోచ్‌లలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సహా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దీంతోపాటు మరణించిన వారందరికీ పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను మోదీ ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు అందజేయనున్నారు. మరోవైపు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రైలు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు మరణించిన వారికి రూ.10 లక్షలు, తీవ్ర గాయాలైన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలకు రూ.50,000 వేలు ఇస్తామని వెల్లడించారు.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి వేడుకలు నిర్వహించబోమని అక్కడి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం సంతాప దినంగా ప్రకటించారు. భువనేశ్వర్‌లోని కంట్రోల్ రూమ్‌లోని ఎస్ఆర్సీలో రెస్క్యూ ఆపరేషన్లను సీఎం సమీక్షించారు. గాయపడిన వారందరికీ ఉచిత వైద్యం అందించాలని ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కెందుజార్ జిల్లాల అధికారులు కూడా ఆపరేషన్‌ను పర్యవేక్షించాలని కోరారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.