JGL: వెల్గటూర్ మండలం శాఖాపూర్ గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. వైద్యం కోసం వరంగల్, కరీంనగర్ ఆసుపత్రులకు తీసుకెళ్లిన తనుగుల శ్రీనివాస్ ఇంటికి తిరిగి వచ్చాక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు చనిపోయాడని భావించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, శ్రీనివాస్‌పై చెమటలు గమనించి బతికే ఉన్నాడని నిర్ధారించారు. వెంటనే వైద్యులను పిలిపించి పరీక్ష చేయించారు.