దక్షిణ అమెరికాలోని గయానాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది చిన్నారులు సజీవ దహనం అయ్యారు. స్కూల్ హాస్టల్ భవనంలో మంటలు చెలరేగడంతో 20 మంది విద్యార్థులు మృతి చెందగా..చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… గయానా దేశ రాజధాని జార్జిటౌన్ కు 200 కిలోమీటర్ల దూరంలోని నైరుతి సరిహద్దు పట్టణం మహ్దియాలోని ఓ సెకండరీ స్కూల్ హాస్టల్ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని తెలిపారు. దీంతో 20మంది విద్యార్థులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు. చాలా మంది గాయపడ్డారు.
బాధితులందరూ 12-18 ఏళ్ల వయసున్న వారే.. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని జార్జిటౌన్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారి పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో వాతావరణం కూడా సరిగ్గా లేదని ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసినట్లు జాతీయ రక్షణ సలహాదారు గెరాల్ద్ గవియా తెలిపారు. దీంతో బాధితులను వాయుమార్గంలో తరలించడానికి, సహాయ చర్యలకు ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొన్నారు.
సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగి సెకండరీ పాఠశాల వసతి గృహంలో మంటలు చెలరేగి విద్యార్థులు చిక్కుకుపోయారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ మంటలను అదుపు చేయడంలో కష్టపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.