RRR actor: ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూత
ఆస్కార్-విజేత చిత్రం RRR మూవీలో నటుడు రే స్టీవెన్సన్ 58 సంవత్సరాల వయస్సులో ఇటలీలో ఆదివారం కన్నుమూశారు. ఇండిపెండెంట్ టాలెంట్‌లో అతని ప్రతినిధులు ఈ వార్తను ధృవీకరించారు.
ప్రముఖ ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్(58) ఇకలేరు. అయితే అతని మృతికి అనారోగ్యమే కారణమని తెలిసింది. ఇటలీలోని ఇస్చియా ద్వీపకల్పంలో క్యాసినో అనే సినిమా షూట్ చేస్తున్న క్రమంలో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
58 ఏళ్ల ఈ నటుడు థోర్, అనేక మార్వెల్ చిత్రాలలో యాక్ట్ చేశాడు. మే 25, 1964న లిస్బర్న్లో స్టీవెన్సన్ జన్మించారు. 90వ దశకం ప్రారంభం నుంచి సినిమాలు, టీవీ షోలలో నటుడిగా మారాడు.
ఎంతో ఇష్టపడే హాలీవుడ్ నటుడు 1990లలో టీవీ షోలలో కనిపించడం ప్రారంభించి 2000ల నుంచి హాలీవుడ్ చిత్రాలలో యాక్షన్ పాత్రలను పోషించడం ప్రారంభించాడు. తర్వాత అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అంతేకాదు గత సంవత్సరం SS రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ బ్లాక్‌బస్టర్ RRRలో గవర్నర్ స్కాట్ బక్స్టన్ క్యారెక్టర్లో నటించి స్టీవెన్సన్ భారతీయ ప్రేక్షకులకు చేరువయ్యాడు.